ఈ హీరోయిన్స్ కి రెండవ పెళ్లి కష్టాలు తప్పవా..?

-

ఇటీవల కాలంలో మొదటి వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోయిన్ లు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి వారు ఆసక్తి చూపకపోయినా వారిపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది నెటిజన్స్.. ఈ క్రమంలోని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. నాగచైతన్య మాజీ భార్య సమంత ఇద్దరు కూడా రెండవ పెళ్లి కష్టాలకు ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరిద్దరికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకపోయినా వివాహం చేసుకోబోతున్నారు.. చేసుకోవద్దు అంటూ.. వీరిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ రెండవ పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం.. మీరు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే ఉండాలని.. మరొక పెళ్లి చేసుకోకూడదని తెగ హడావిడి చేశారు. అందుకే రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకున్న సమయంలో కూడా అతడి ఫేస్ చూపించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల కారణంగా ఆమె తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరహాలో నాగచైతన్య అభిమానులు కూడా సమంత విషయంలో తెగ హడావిడి చేస్తున్నారు.

యశోద సినిమా సక్సెస్ మీట్ లో సమంత ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది బాగా వైరల్ అయింది. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి అక్కినేని అభిమానులతో పాటు మరికొంతమంది కావాలని నానా రచ్చ చేశారు. అంతేకాదు అతడిని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ.. సమంతతో నువ్వు ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంత రెండో వివాహం చేసుకోకూడదు అంటూ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. గతంలో రేణు దేశాయ్ కి ఎలా అయితే కొందరి నుండి విమర్శలు వచ్చాయో.. ఇప్పుడు సమంత విషయంలో కూడా అలాగే జరుగుతోంది. మొత్తానికైతే కొంతమంది తప్పుడు ప్రచారాలు వల్ల వీరిద్దరూ బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version