టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబరు తీసుకురానున్నారు.
ఇక జమున మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరమన్నారు సీఎం జగన్. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం వైఎస్ జగన్.