సాహో మేకింగ్ వీడియో 2… శ్ర‌ద్ధా క‌పూర్ లుక్ అదిరింది..!

-

సాహో చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఒకేసారి ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇందులో ప్ర‌ముఖ న‌టులు జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేష‌న్స్ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, ఇందులో హాలీవుడ్ స్థాయి యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని మొద‌ట్నంచీ చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకు త‌గిన విధంగా టీజ‌ర్‌లో మ‌న‌కు ప‌లు స‌న్నివేశాలు కూడా క‌నిపించాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు చెందిన మ‌రో టీజ‌ర్‌ను ఇవాళ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. షేడ్స్ ఆఫ్ సాహో – చాప్ట‌ర్ 2 పేరిట చిత్ర‌యూనిట్ ఓ మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది. ఇవాళ శ్ర‌ద్ధా క‌పూర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆ వీడియోలో ఆమెకు సంబంధించిన‌ ఓ స‌న్నివేశాన్ని కూడా చూపించారు.

సాహో చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసిన తాజా మేకింగ్ వీడియోలో స‌న్నివేశాలు హాలీవుడ్ సినిమాల‌ను త‌లపించేలా ఉన్నాయి. అధునాతన కెమెరాలు, నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో.. ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇవాళ విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలో శ్ర‌ద్ధాక‌పూర్ లుక్ అదిరిపోయింది. అలాగే ప్ర‌భాస్ కూడా ఇందులో హై వోల్టేజ్ యాక్ష‌న్ సీన్‌లో క‌నిపించి అల‌రించాడు.

సాహో చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఒకేసారి ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇందులో ప్ర‌ముఖ న‌టులు జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో సాహో చిత్ర విడుద‌ల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news