Bigg Boss 5 : సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్! ఎందుకు అంతలా టార్గెట్ చేస్తున్నారంటే?

-

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు గత సీజన్లతో పోల్చితే.. తాజా సీజ‌న్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ అందించ‌డంలో ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌తి కంటెస్టెంట్. ఇందుకోసం వారి శ‌క్తియుక్తుల‌ను ధార‌పోస్తున్నారు. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్ల మ‌ధ్య‌ గొడ‌వ‌లు, అల్ల‌ర్లు, మాట‌ల తూటలు పేలుతున్నాయి. ఒక్కొక్కో సారి మిని వార్ జరుగుతోంది.

ఇక హౌస్ లో చాలా అగ్రిసివ్ అంటే.. ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు సన్నీ. త‌న క్యారెట‌ర్ చాలా మంచిది. కానీ, ప్ర‌తి విష‌యానికి ఇట్టే ఉలిక్కి ప‌డుతాడు. ఆ కార‌ణంగా ఆయ‌న‌ను టార్గెట్ చేస్తే.. మాత్రం ఓ రేంజ్ లో మాస్ సినిమా చూపిస్తాడు.

ఈ విషయంలో ప‌లు కింగ్ నాగ్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు. ఇదే అలుసుగా తీసుకోని కొంద‌రూ కంటెస్టెంటు త‌న‌ని కావాల‌ని టార్గెట్ చేశారు. దీంతో మళ్ళీ ముందులాగే అగ్రేసివ్ గా మారాడు. నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి కింగ్ నాగార్జున సన్నీ మీద ఫైర్ అయ్యారు. ఆ ఆవేశాన్ని త‌గ్గించుకో అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స‌న్నీ తన‌దైనా శైలిలో గేమ్ ఆడుతు.. షోను చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాడు.

షో టీఆర్పీ పెర‌గ‌డానికి స‌న్నీ గేమ్ ప్లాన్ అన‌డంతో అతిశ‌యోక్తి లేదు. గ‌తంలో ప్రియ విష‌యంలో ఎలాంటి గొడ‌వ అయిందో అందరికి తెలుసు. ఇలా త‌న‌దైన స్టైల్ లో గేమ్ ఆడుతూ.. విప‌రిత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. టాప్ 5 కంటెస్టెంట్లో ఒక్క‌డిగా నిలిచారు. ఈ క్ర‌మంలో సెల‌బ్రెటీల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

కానీ, బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ, ష‌న్ను మ‌ధ్య గొడ‌వ పెద్ద ర‌చ్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలో సన్నీ షణ్నుల మాట‌ల తూటాలు పేలాయి. షణ్ను మాములుగా తీసుకున్నా సన్నీ రెచ్చిపోవడంతో షణ్ను కూడా తన కోపం చూపించాడు. అయితే ఈ వివాదంపై షణ్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సన్నీని కాడిగి పారేసింది. షన్నును త‌నదైన శైలిలో స‌పోర్ట్ చేస్తూ.. సన్నీ ఏకీ పారేసింది దీప్తి.

తాజాగా మరో మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శివజ్యోతి కూడా షన్నుకి మద్దతుగా పోస్ట్ చేసింది. దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని షేర్ చేస్తూ.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆట‌కాదంటే .. మీరు కెప్టెన్ అయిన‌ప్ప‌డూ..
యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేశారు. అది లేడీ కార్డ్ ను ఉప‌యోగించ‌డం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్‌ లోపల హెల్తీ గేమ్‌ ఆడండి. అంటూ స‌న్నీ గట్టిగా కౌంటర్ వేసింది శివ జ్యోతి. వేరే సెలబ్రిటీలు కూడా షణ్ణుకి సపోర్ట్ గా పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షన్ను ఫాన్స్ మాత్రమే… కాక, వేరే వాళ్ళు కూడా సన్నీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ గొడవ ఇంకా ఎక్కడిదాకా దారి తీస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news