ఆ చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు మొదటి సారి గుండెనొప్పి.. ఆయన ఏం చేశారంటే?

-

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, కళా ప్రపూర్ణ, డాక్టర్ నందమూరి తారక రామారావు.. తెలుగు ప్రజల ఆరాధ్యుడు అని చెప్పొచ్చు. తెలుగు వారు ఎక్కడున్నా ఆయన్ను గౌరవిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ చరిత్రలో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన సీనియర్ ఎన్టీఆర్ కు మొదటి సారి గుండెనొప్పి ఆ ఫిల్మ్ షూటింగ్ లో వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ పిక్చర్ ‘జస్టిస్ చౌదరి’. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. తన నట విశ్వరూపం చూపించేశారు ఎన్టీఆర్. ‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో’ అనే పాట షూట్ చేస్తున్న క్రమంలో ‘బ్రదర్ పది నిమిషాలు రెస్ట్ కావాలి’ అని దర్శకుడు రాఘవేంద్రరావు కు ఎన్టీఆర్ చెప్పారట.

అలా రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ‘ఏమైంది ..అన్నగారు’ అని రాఘవేంద్రరావు అడగగా ‘ఇట్స్ ఆల్ రైట్.. పది నిమిషాల తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం’ అని చెప్పి.. మళ్లీ షూట్ కంప్లీట్ చేశారట. కాగా, ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు ఆ పాట షూటింగ్ లో మొదటి సారి గుండె నొప్పి వచ్చిందన్న సంగతి ఎన్టీఆర్ స్వయంగా దర్శకుడు రాఘవేంద్రరావుకు చెప్పారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కూ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, ఇందులోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news