వైరముత్తుపై సింగర్ చిన్మయి ఫైర్.. ఏకంగా సీఎంకే ఫిర్యాదు

-

కోలీవుడ్‌ లిరిసిస్ట్ వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి విరుచుకుపడ్డారు. ఆయణ్ను ఉద్దేశిస్తూ ట్విటర్‌ వేదికగా మరోసారి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘బ్రిజ్‌ భూషణ్‌కైనా, వైరముత్తుకైనా రూల్స్‌ ఒకేలా ఉండాలి. ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరోలా ఉండకూడదు. (రెజ్లర్లకు సీఎం స్టాలిన్‌ మద్దతునివ్వడాన్ని ఉద్దేశిస్తూ..) బ్రిజ్‌భూషణ్‌ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్‌తోపాటు ఒక మైనర్‌ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీతో సత్సంబంధాలు ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దాంతో, ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మాకున్న కలలతో పోలిస్తే అతడి టాలెంట్‌ ఏమీ గొప్పది కాదు. దయచేసి, వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాంతో తమిళనాడులోని పనిప్రదేశాలు సేఫ్‌గా ఉంటాయి. సొంత ఇండస్ట్రీ (కోలీవుడ్‌ను ఉద్దేశిస్తూ) నుంచే బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా నాకు సపోర్ట్‌ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు’’ అని ఆమె రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version