తింటే గారెలు తినాలి..వింటే మహా భారతం వినాలి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.అంత వినసొంపుగా..చెవుల్లో అమృతం పోసిన విధంగా మన తెలుగు ఉచ్చారణ ఉంటుంది.. తెలుగు భాష తియ్యదనం గురించి చెప్పాలంటే మాటలు చాలవు..రాతలు సరిపోవు..దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు ఓ కవి..అలా పాటలు కూడా ఎంతో చక్కగా ఉండటంతో మనుషులు తెలుగు పాటలను వింటూ మైమరచి పోతున్నారు..ఎంతో సాహిత్యం, అర్థం ఉన్న పాటలకు ఎప్పటికీ విలువ తగ్గదు..అలా జనాలను ఆకర్షించేలా రాయడానికి, పాడడానికి ఎంత కష్టం ఉంటుంది.
ఆ పాట గాత్రం కొత్తదైతే, సంగీతం కొత్త వారిదైతే, సాహిత్యం కొత్త కలం నుండి జాలువారితే, అది ఇంత మందికి చేరడానికి ఇంకెంత కష్టం ఉంటుంది.. ఆ పాట ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా చేయడానికి చేసే ప్రయత్నం, అది ఆసియా రికార్డు పుస్తకాల్లో ఎక్కడానికి వెనుకున్న కథ ఏంటి? కాస్త వివరంగా తెలుసుకుందాం…
తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో, జగిత్యాలలో పుట్టి, పెరిగి, తన డిగ్రీని పూర్తిచేసి సంగీతం పైన అమ్మితమైన ప్రేమతో సంగీతం నేర్చుకుంటూ, తెలుగు ఆస్ట్రేలియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల తల్లిగా, ఇల్లు చక్కబెడుతూ, ప్రపంచమంతా తన గొంతు వినాలని ప్రతీ ఇంటిలో తన పేరు మారు మ్రోగాలని కృత నిశ్చయంతో ముందుకు వచ్చింది సుష్మిత రాజేష్.. తన భర్త, అత్తింటి వారి ప్రోత్సాహంతో తను సంగీతం నేర్చుకుంటున్న పద్మభూషణ్ చిత్రమ్మ గారి స్ఫూర్తితో, త్రియ సుష్మా గారి శిష్యరికంతో, పాటల వైపు జీవితాన్ని ప్రారంభించారు..ఎ లాంటి పాటతో తన గొంతును పరిచయం చెయ్యాలి అన్న ఆలోచనను తెలిసిన పరిచయస్తులతో పంచుకుంది.. ఆ క్రమంలో సంగీతంతో అద్భుతాలు చేయాలని.. తనకున్న మక్కువ, తపనతో తాపత్రయపడే మ్యూజిషియన్ గౌతం పరిచయం అయ్యాడు.
తన కసితో చేసిన అద్భుతమైన ట్యూన్ కి సాహిత్యం అమర్చే పనిని తెలుగు సంస్కృతి పైన అపారమైన గౌరవం కలిగి సంక్రాంతి పండుగ పాట లో వర్ణించిన వివేక్ కు అప్పగించడం జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు గడపలో, ప్రతీ ఇంటి పెళ్లిలో ఈ పాట వినపడాలని అందరూ తమ సాయ శక్తుల ప్రయత్నం చెయ్యడానికి సిద్దం అయ్యారు.. మనదేశంలో జరిగే పెళ్లిళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఘనంగా చేసే సంప్రదాయం ఉంది.
అందుకే విదేశాల్లో ఉన్నా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మీద మమకారంతో తన ఆల్బమ్ లో మొదటి పాట పెళ్లి పాటగా ఉండాలని సుష్మిత ఎంచుకుంది. ఆస్ట్రేలియాలో ఫిజీ టైమ్స్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చదువరులు కలిగిన డెక్కన్ హెరాల్డ్ లో కూడా సుష్మిత గురించి ప్రచురితం కావడం నిజంగా గర్వించదగ్గ విషయం..తెలుగు ఖ్యాతిని పదింతలు పెంచిన విషయం..
ఇది ఇలా ఉండగా.. తెలుగు ప్రముఖ హాస్యనటుడు ఆలీ గారి శ్రీమతి, జుబేదా గారు కూడా సామాజిక మాధ్యమాల్లో తన వీడియోస్ చేయడం చూసి సుష్మిత గారు ఎంతో ప్రభావితమయ్యారు. జుబేదా గారే తనకి స్ఫూర్తి అని చెప్పారు.
చాలా సందర్భాలలో ఈ విషయం గురించి చెప్పింది..ఆలీ తన భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆయనకు ఎంతో పేరుతెచ్చిన సిరులోలికించే చిన్నినవ్వులే పాట పాడి సుష్మిత గారికి స్ఫూర్తిగా నిలిచిన జుబేదా గారి చేత ప్రశంస పొందడంతో తన ప్రపంచం పాటలు కావాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.
సుష్మిత ఆశయం నెరవేరాలని ఎందరో ప్రముఖులు,ఈ మన తెలుగు బిడ్డ ఆశయం కోసం ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు, తెలుగు బిగ్ బాస్ లో పేరు తెచ్చుకున్న ఎంతోమంది గొప్ప గాయని గాయకులు, జుబేదా గారు, ఆలీ గారు, అందరూ వాళ్ళ విషెస్ చెప్పారు.. మన తెలుగు తేజం విజయాన్ని అందుకోవాలని మనం కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా.. ఆల్ ద బెస్ట్ సింగర్ సుష్మిత రాజేష్..