సోనాలి బింద్రే నయా లుక్..మోడ్రన్ డ్రెస్‌లో సీనియర్ హీరోయిన్ హొయలు

టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన దాదాపుగా నటించి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల నటి సోనాలి బెంద్రే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ భామ..భాష ఏదైనా నటనతో ఆకట్టుకుంది.

కేన్సర్ వలన కొంత కాలం పాటు వెండి తెరకు దూరమైంది. ఆ వ్యాధి నుంచి కోలుకొని మళ్లీ తిరిగి బుల్లి తెరపై సందడి చేయబోతున్నట్లు ఇటీవల తెలిపింది ఈ అందాల సుందరి. స్టార్ లైఫ్ ఓకే టెలివిజన్ లో DID Li’ls మాస్టర్స్ సీజన్ 5 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నది ఈ సీనియర్ హీరోయిన్.

సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి, తన గురించి అప్డేట్స్ ఎప్పడికప్పుడు ఇస్తుంటుంది సోనాలి. తాజాగా సోనాలి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా మోడ్రన్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. నలుపు రంగు డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘సోనాలి ఈజ్ బ్యాక్, హార్ట్లీ వెల్కమ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోనాలి బింద్రే తెలుగులో చేసిని సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ కావడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre)