సోనియా సింగ్ నటించిన 10 బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఇవే.. తప్పక చూడాల్సిందే!

-

తాజాగా సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ మూవీలో హీరో హీరోయిన్లు కాకుండా ఓ అమ్మాయి పాత్ర చాలా ఎట్రాక్ట్ చేసుంటుంది. ఆమె చేసింది చిన్న పాత్రే కానీ స్టోరీలో చాలా కీలకం. ఈ యాక్టర్ సోనియా సింగ్. కాగా ఈమె నటించిన హిట్ వెబ్ సిరీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకున్న నటి సోనియా సింగ్.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాదాపు నాలుగేళ్ల క్రితమే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పటినుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈమె విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టడంతో మరొకసారి ఈమె నటించిన షార్ట్ ఫిల్మ్స్ గురించి చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు..

కాగా సోనియా సింగ్ యాక్ట్ చేసిన చాలా ఫేమస్ అయిన షార్ట్ ఫిల్మ్ ‘షీ అండ్ పీరియడ్స్’. ఓ భార్యకి పీరియడ్స్ సమయంలో ఆమె భర్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు చివరికి కథ ఎలా మారింది అనే విషయాన్ని చక్కగా చూపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ కి ఏకంగా 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.

ఇక ‘నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్’ అనే మరో షార్ట్ ఫిల్మ్ సోనియా లో చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓ తెలుగు రానీ అమ్మాయి వల్ల ఓ అబ్బాయి ఎన్ని పాట్లు పడ్డాడనేది ఈ షార్ట్ ఫిల్మ్ లో చక్కగా వివరించారు.

సోనియా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో చేసిన వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. రెండేళ్ల క్రితం ‘పెళ్లైన కొత్తలో’ అని ఓ సిరీస్ చేసింది. రెండు సీజన్లుగా వచ్చిన ఈ షార్ట్ ఫిలిం సోనియా కి విపరీతమైన క్రేజ్ సంపాదించి పెట్టింది ఇందులో ఆమెకి జోడిగా పవన్ సిద్ధూ నటించారు. వీరిద్దరి జోడి చాలా ఫేమస్ అవడంతో.. ‘అనసూయ రామలింగం’. ఓ మాస్ కుర్రాడు వంటి వెబ్ సిరీస్ తెరకెక్కాయి.

వీటితో పాటు ‘సుజాత సుబ్రహ్మణ్యం’ వెబ్ సిరీస్ మంచి హైలెట్ గా మారింది. ఇందులో క్యూట్ పెయిర్ గా సోనియా, పవన్ సిద్ధు నటించారు. ఇక ఈ సిరీస్ తర్వాత సోనియా యాక్ట్ చేసిన సింపుల్ అండ్ క్యూట్ సిరీస్ ‘ప్రేమలేఖ’. ప్రేమని బేస్ చేసుకుని తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ నెటిజన్స్ ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. లవ్ అంటే ఎప్పుడూ హ్యాపీస్ మాత్రమే కాదు అప్పుడప్పుడు బాధలు కూడా ఉంటాయనే కాన్సెప్ట్ తో తీసిన సిరీస్ ‘నీవే’. ఆరు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఫ్యాన్స్ ని భలే ఎంటర్ టైన్ చేసింది. ఇందులోనూ పవన్ సిద్ధునే ఈమెకు జోడీగా చేశాడు.

ఇక ఈ వెబ్ సిరీస్ అనంతరం నటించిన మరో బెస్ట్ వెబ్ సిరీస్ ‘అమ్మ ఆనంద్ ఆవకాయ్’. ప్యూర్ నేటివిటీ టచ్ తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ వ్యూయర్స్ ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. ఇందులో మొత్తం 11 ఎపిసోడ్స్ ఉండగా అన్ని మంచి ప్రేక్షకు ఆదరణ సంపాదించుకున్నాయి. కాగా ప్రస్తుతం చేస్తున్న సిరీస్ అంటే ‘అలివేలు శ్రీనివాసులు’. ఫన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఇందులో నుంచి ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్ వచ్చాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి. ఇక యూట్యూబ్ లోకి వచ్చిన కొత్తలో సోనియా చేసిన ‘మెడికో గర్ల్ ఫ్రెండ్’ కూడా బాగానే ఎంటర్ టైన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version