హీరో రామ్ తో కెమిస్ట్రీపై శ్రీ లీలా రొమాంటిక్‌ కామెంట్స్‌

-

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం స్కంద. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 28వ తేదీన అంటే ఇవాళ ఈ సినిమా రిలీజ్‌ అయింది.

Sreeleela Interesting comments on Ram Pothineni

కాగా, ధమాకా తర్వాత ‘స్కంద’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించబోతుండడం సంతోషంగా ఉందని హీరోయిన్ శ్రీ లీల అన్నారు. ఈ సినిమాలో తాను రూల్స్ పాటించే అమ్మాయిగా నటించానని చెప్పారు. ఓవైపు మాస్, మరోవైపు క్లాస్ గా మూవీలో తాను కనిపిస్తానన్నారు. నటించేటప్పుడే కాదు డబ్బింగ్ సమయంలోనూ సినిమాను ఎంజాయ్ చేశానని, రామ్ తో తన కెమిస్ట్రీ బాగుంటుందని శ్రీ లీలా తెలిపారు. ఆయనలా డాన్స్ చేయడం కష్టమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version