మెగాస్టార్ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాస‌న్‌!

-

స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ కొత్త సంవ‌త్స‌రం చాలా బిజీ గా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స‌లార్ మూవీలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజా గా మెగాస్టార్ చిరంజీవి సినిమా లో కూడా హీరోయిన్ గా ఎంపిక అయిన‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం మెగా స్టార్ చిరంజీవి త‌న 154 వ సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ఓ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ ఇప్ప‌టికే చిత్ర బృందం విడుద‌ల చేసింది.

అలాగే వ‌ర్కింగ్ టైటిల్ గా మెగా 154 గా పెట్టారు. ఈ సినిమా ప‌క్క మాస్ యాక్ష‌న్ గా తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి స‌ర‌స‌న శృతి హాస‌న్ ను చిత్ర బృందం ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీని పై చిత్ర బృందం గానీ , శృతి హాస‌న్ గానీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఈ అమ్మ‌డు మెగాస్టార్ చిరంజీవికి జోడీ న‌టించ‌డం దాదాపు క‌న్ఫామ్ అయిన‌ట్టే అని తెలుస్తుంది. అలాగే శృతిహాస‌న్ ప్ర‌భాస్ స‌లార్ తో పాటు బాల‌కృష్ణ సినిమాకూ కూడా ఓకే చెప్పింద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news