హిట్ డైరెక్ట‌ర్ల‌కు మూడోసారి ఛాన్స్ ఇచ్చిన ముగ్గురు హీరోలు!

ఒక‌సారి హిట్ ఇస్తే చాలు ఆ డైరెక్ట‌ర్‌కు ఏరికోరి మ‌రీ ఇంకో అవకాశం ఇస్తుంటారు హీరోలు. అందులో ఎవ‌రూ త‌క్కువ కాద‌నే చెప్పాలి. అయ‌తే ఇప్పుడు ఓ ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం గ‌తంలో త‌మ‌కు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోలు కూడా మూడోసారి ఆ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు.

ప్ర‌స్తుతం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను డైరెక్ష‌న్‌లో భారీ సినిమా అఖండ ను చేస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన సింహా, లెజెండ్ మూవీలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్ర‌స్తుతం వీరిద్దరి కలయికలో మూడో సినిమాగా అఖండ వ‌స్తోంది. ఇక ఇదే దారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సుకుమార్‌తో పుష్ప చేస్తున్నారు.

వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు బాగానే ఆడాయి. ఆర్య సినిమాతో స్టార్ హీరోగా మారారు అల్లు అర్జున్‌. ఇక ఇప్పుడు మూడోసారి పుష్ప మూవీ చేస్తున్నారు ఈ ఇద్ద‌రు. ఇక వీరి బాట‌లోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మూడోసారి సినిమా చేస్తున్నారు. ఇంత‌కు ముందు వీరి కాంబోలో వ‌చ్చిన అతడు, ఖలేజా మూవీలు బాగానే ఆక‌ట్టుకున్నాయి. మొత్తంగా ముగ్గురు హీరోలు ముగ్గురు డైరెక్ట‌ర్ల‌కు మూడోసారి ఛాన్ష్ ఇస్తున్నార‌న్న మాట‌.