మహేష్ దర్శకుడితో సినిమా చేయనున్న బన్నీ….??

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించారు. ఇక ప్రస్తుతం వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న బన్నీ, అనంతరం ఐకాన్ అనే సినిమాలో కూడా నటించనున్న విషయం తెలిసిందే.

ఇక వీటి తరువాత బన్నీ చేయబోయే మరొక ప్రాజక్ట్ కూడా నేడు ఓకె అయినట్లు పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఇక వాటి ప్రకారం, మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బై లింగ్యువల్ మూవీ స్పైడర్ ని తెరకెక్కించిన ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ అతి త్వరలో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రజినీకాంత్ తో కలిసి దర్బార్ అనే సినిమా తీసిన మురుగదాస్, బన్నీ తో చేయబోయే సినిమాని మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీయనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల ఒకానొక సందర్భంలో బన్నీ ని కలిసిన మురుగదాస్ ఒక మంచి స్టోరీ లైన్ ని విపించడం జరిగిందని,

 

అయితే అది ఎంతో నచ్చిన బన్నీ, దానిని పూర్తి స్క్రిప్ట్ గా డెవలప్ చేయండి తప్పకుండా చేద్దాం అని మాటిచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఆ సినిమాకు ఎవరు నిర్మాత, ఎవరెవరు నటిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదని, కాగా మరికొద్దిరోజుల్లో ఈ సినిమా విషయమై అధికారికంగా ఒక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news