హిందీ జాతీయ భాష కాదు… కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ సంచలన కామెంట్స్

-

కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడలో స్టార్ హీరోల్లో ఒకరు. రాజమౌళి ఈగ తరువాత తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యాడు. ఈగ సినిమాలో స్టైలిష్ విలన్ లుక్ లో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత ‘ బాహుబలి’లో సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సల్మాన్ ఖాన్ దబంగ్ సిరీస్ లో కూడా విలన్ గా నటించాడు.

ఇదిలా ఉంటే కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ భాష హిందీ కాదని అన్నారు. ఇటీవల రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తో పాటు, హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ ఏ మాత్రం జాతీయ భాష కాదని… నేడు బాలీవుడ్ ఎన్నో సినిమాలను నిర్మిస్తుందని.. తెలుగు, తమిళం, కన్నడలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు. అయినా అవి విజయం సాధించలేకపోతున్నాయని అన్నారు. కానీ ఈ రోజు మనం తీస్తున్న సినిమాలు ప్రపంచం మొత్తం చూస్తుందని ఆయన అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version