బాలయ్య కు పోటీగా సుమ.. ఆయనను మించి మెప్పించగలరా..?

-

ఇన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు ఆహా నిర్వాహకుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో అంచనాలకు నుంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇప్పుడు సీజన్ వన్ పూర్తి చేసుకొని రెండవ సీజన్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ బోతున్నారు. ఇప్పటికే నిన్న రిలీజ్ అయిన మొదటి భాగం మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో బాలయ్య , ప్రభాస్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓటీటీ లో ఈ షో అంచనాలకు మించి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే అన్ స్టాపబుల్ షో హిట్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ తరహా షో ప్రారంభం కానుంది. బదులుగా ఈ షో ప్రసారం అవుతుందా లేక వేరే టైం లో ఈ షో ప్రసారం కానుందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. సెలబ్రిటీలను గెస్ట్లుగా పిలవడంతో పాటు కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకొని ఈ షో నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు బాలయ్య షో కి పోటీగా సుమ కొత్త షో చేయబోతున్న నేపథ్యంలో బాలయ్యను మించి మెప్పించడం సుమకు సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య టాక్ షో మరో నెల రోజుల్లో ముగియబోతున్న నేపథ్యంలో ఆ తర్వాత సుమా షో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్త యాంకర్లు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నేపథ్యంలో సుమ హవా కాస్త తగ్గింది. ఈమె షోలు రొటీన్ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలయ్య షోకి పోటీగా వస్తున్న సుమా షో ఏ మాత్రం మెప్పిస్తుంది అనే విషయం సందేహంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news