కూతురికి మద్యం తాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన సురేఖ వాణి.. ఫోటో వైరల్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను చాటుకుంది. తల్లిగా , అక్కగా, వదినగా ఇలా పలు క్యారెక్టర్లలో నటించడమే కాకుండా సుమారు అందరు స్టార్ హీరోల సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఈమె పండించే కామెడీ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని చెప్పవచ్చు . ఇది ఇలా ఉండగా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటేనే మరొకవైపు తన కూతురు సుప్రీత తో కలిసి ఈమె చేసే అల్లరి అంతా ఇంకా కాదని చెప్పాలి . ముఖ్యంగా వీరిద్దరూ తల్లి కూతుర్లుగా కాకుండా సిస్టర్స్ గా, ఫ్రెండ్స్ గా తమకు నచ్చింది చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు.Actress Surekha vani about her daughter, Actress Surekha Vani,Photoshoots, Social Media, Expose, netizens - Telugu Actresssurekha, Expose, Netizens, Photoshoots

సురేఖ వాణి కూడా కూతురితో సమానంగా చిట్టి పొట్టి బట్టలు ధరిస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తుంది. అంతేకాదు తన కూతురితో అప్పుడప్పుడు ఈమె చేసే డ్యాన్సులకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి రాకముందే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. సెలబ్రిటీ హోదాతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ఇటీవల పలు కవర్ సాంగ్స్లలో కూడా నటిస్తోంది.. యూట్యూబ్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ లో నటించినట్లు, ఇక ఒక సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా సుప్రీతకు దగ్గరుండి మద్యం తాగిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా దొరికిపోయింది సురేఖ వాణి.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల సుప్రీత పుట్టినరోజు కాగా.. ఇక తన తల్లి సురేఖ వాణి అలాగే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గ్రాండ్గా సుప్రీతా బర్తడేను సెలబ్రేట్ చేశారు. ఇక అందులో తన తల్లి సురేఖవాణి.. కూతురికి మందు తాగించి మరీ బర్తడే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉండగా.. ఒక తల్లి వై ఉండి కూతురికి మంచి హితబోధ చేయాల్సింది పోయి ఇలాంటి అలవాట్లు నేర్పిస్తావా అంటూ సురేఖ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు సుప్రీతా డ్రెస్ పై కూడా మరింత కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news