ఆర్ఆర్ఆర్ : వేస‌వి వినోద‌మా? వ‌ర్షాకాల సంబ‌ర‌మా?

ఆర్ఆర్ఆర్ విడుద‌లకు సంబంధించి ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.అంద‌రికీ అనుకూలంగా ఉంటే డేట్ ఒక‌టి వెతికే ప‌నిలో ఉన్నారు జ‌క్క‌న్న.. ఈ సినిమా ఎలా ఉన్నా కూడా డ‌బ్బులు రాబట్టుకుని తీర‌డం ఖాయం కానీ నిర్మాత‌కు మాత్రం కొన్ని టెన్ష‌న్లు ఉన్నాయి. వాటిని కూడా రాజ‌మౌళి త‌న నెత్తిపై వేసుకున్నారు. రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లకు పైగా డబ్బుల‌కు ఇవాళ రాజ‌మౌళినే హామీ దారు అంటే న‌మ్మ‌గ‌ల‌మా? ఎవ‌రు న‌మ్మినా న‌మ్మ‌కున్నా ఇదే వాస్త‌వం భ‌య్యా!

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అన్న ఆతృత‌లో అభిమానులు ఉన్నారు.అటు నంద‌మూరి అభిమానులు, ఇటు మెగాభిమానులు క‌ళ్లింత‌లు చేసుకుని చూస్తున్నారు.క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డిన‌ప్ప‌టికీ సినిమాపై అంచ‌నాలు మాత్రం ఎక్క‌డ త‌గ్గ‌లేదు.అదే స‌మ‌యంలో అంచ‌నాలు ఇంకా పెరిగిపోతున్నాయి.మూవీకి సంబంధించి ఇప్ప‌టిక‌దాకా ఖ‌ర్చు చేసిన ప్ర‌తి రూపాయీ వెన‌క్కు వ‌స్తుంద‌న్న ధీమా లో రాజమౌళి ఉన్నారు. అందుకే సినిమా రూప‌క‌ల్ప‌న‌లో ఎంత ఆల‌స్యం అయినా విడుద‌ల ఎంత ఆల‌స్యం అయినా అవేవీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఈ సినిమాను వేస‌వికి విడుద‌ల చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌నలో రాజ‌మౌళి ఉన్నార‌ని తెలుస్తోంది.ఏప్రిల్ నెలాఖ‌రులో వేస‌వి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.లేదంటే వ‌ర్షాకాలం ఆరంభంలో జూన్ లో విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆరాలో కూడా ఉన్నారు. నార్త్ లో ప‌రిణామాలు స‌ర్దుకుంటే చాలు సినిమా విడుద‌ల అన్న‌ది సులువు కావొచ్చు.ఒక‌వేళ ఇక్క‌డ ప‌రిణామాలు స‌ర్దుకున్నా కూడా నార్త్ ఓరియెంటెడ్ బిజినెస్ పైనే రాజ‌మౌళి ఆశ‌ల‌న్నీ ఉన్నాయి.అదేవిధంగా ఓవ‌ర్సీస్ పై కూడా ఆశ‌లున్నాయి. ఈ రెండూ నెర‌వేరితే చాలు.

తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీని మిన‌హాయించుకుని వ్యాపారం చేయ‌డం చాలా క‌ష్టం. కానీ చేయాలి. అందుకే ఇప్ప‌టిదాకా జ‌రిగిన మార్కెట్ ఒప్పందాలు అన్నీ రివైజ్డ్ అవుతున్నాయి.అదే విధంగా తెలంగాణలో కూడా ఏమ‌యినా మార్పులు రావొచ్చు. టికెట్ ధ‌ర‌ల‌పై మంత్రి త‌ల‌సాని ఫేవ‌ర్ గానే ఉన్నా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఓ వెబ్ పోర్ట‌ల్ వ‌స్తే, బుక్ మై షో త‌ర‌హాలో అమ్మ‌కాలు చేయాల‌నుకుంటే కాస్త ఇబ్బంది త‌లెత్త వ‌చ్చు. అందుకే ఈ సినిమా విష‌య‌మై ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా అదంతా రెండు తెలుగు రాష్ట్రాల‌ను మిన‌హాయించే చేయాలి. కానీ తెలుగు మార్కెట్ పై ప్రేమ‌ను అయితే రాజ‌మౌళి వదులుకోలేక‌పోతున్నారు.అందుకే విడుద‌ల విష‌య‌మై దేశ వ్యాప్తంగా అంగీకారం కుదిరే విధంగా ఆలోచిస్తూ ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు.