ఉద్యోగ సంఘాల కీలక భేటీ… సమ్మెపై నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. పలు ఉద్యోగసంఘాలు అన్ని కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే ఒకసారి భేటీ అయిన ఉద్యోగ సంఘాలు నేడు మరోసారి భేటీ కానున్నాయి. విజయవాడలోని ఎన్జీఓ హోంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ అమరావతి ఉద్యోగ సంఘం పాటు మరికొన్ని ఉద్యోగసంఘాలు భేటీ కానున్నాయి. ఉద్యోగ సంఘాలన్నీ.. పీఆర్సీ వ్యతిరేఖ జీవోలన్నింటిని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణలపై చర్చించనున్నారు.

మరోవైపు ఉద్యోగ సంఘాలు సమ్మెకు మొగ్గు చూపుతారా.. అనే సందిగ్థం నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రభత్వం పెద్దలు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం జరుగుతుండటంతో.. సమావేశంలో సీఎం, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించే ఆలోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి.