టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో కలిసి కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఊతమిస్తూ ఈ జంట న్యూ ఇయర్ వేడుకల్లో కిస్ చేసుకుంటూ కెమెరాకు చిక్కడంతో అది నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట అప్పుడప్పుడు ముంబయి వీధుల్లో కలిసి కనిపిస్తూ.. కేవలం ప్రొఫెషనల్ పరంగానే మీట్ అవుతున్నట్లు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా తమన్నా.. విజయ్‌లు డిన్నర్ డేట్‌కు వెళ్లి బీ టౌన్ కెమెరాలకు చిక్కారు.
సోమవారం రోజున ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఈ జంట తిరిగి వెళ్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. అయితే వారు మీడియాకు హాయ్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో త్వరలోనే వీరు తమ రిలేషన్ గురించి బయటపెడుతుందన్న ఆతృతతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్లో వీళ్లిద్దరికీ పరిచయం అయ్యిందని, అక్కడే వీరు ప్రేమలో పడ్డారని బీ టౌన్లో టాక్.