హీరోలపై సంచలన కామెంట్లు చేసిన తమన్నా.!

-

మిల్క్ బ్యూటీ తమన్నా హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉండేదో ఇప్పటికే అలాగే ఉంది. అందం , అభినయంతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ క్రమంలోనే రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోల బిహేవియర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా రొమాంటిక్ సీన్లు షూట్ టైంలో హీరోయిన్లు ఎలా అనుకుంటారో అని హీరోలు తెగ టెన్షన్ పడతారని తమన్నా తెలిపింది.

మొహమాటంగా ఉండే హీరోలైతే ఇలాంటి సీన్ల సమయంలో మాట్లాడ్డానికి ఎక్కువగా ఇష్టపడరు అని కూడా చెప్పుకొచ్చింది. అది కాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలామంది హీరోలు ఇష్టపడరు. ఇంతమంది చుట్టూ ఉండగా రొమాంటిక్ సీన్స్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి అంటూ తమన్న వెల్లడించింది. ప్రస్తుతం తమన్న చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తమన్నా అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఆసక్తి చూపుతోంది.

అయితే అనుకున్నంత స్థాయిలో ఈమెకు కలిసి రావట్లేదని చెప్పవచ్చు. ఈ సంవత్సరం విడుదలైన సీటీమార్, F3 సినిమాలు ఒకరకంగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటడంతో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని బంధువులతో పాటు అభిమానులు కూడా అడుగుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈమె ఈ విషయంపై నోరు విప్పకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news