మిల్కీ బ్యూటీ అందాలు ఆ‘రేంజ్’ అంతే..చూసి తట్టుకోలేరు!

-

అందం, అభినయం కలగలిపి ఉన్న అందాల తార తమన్నా భాటియా. ఈ హాట్ బ్యూటీ నటించిన
F3 చిత్రం ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమన్నా F3 చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతోంది. ఈ టీ వీ ‘క్యాష్’ ప్రోగ్రాంలో సందడి చేసిన ఈ భామ..కార్యక్రమంలో చిత్ర విశేషాలు పంచుకుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘లెట్స్ గెట్ ది పార్టీ స్టార్టెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో తన అందమైన ఫొటోలు షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ టాప్ లో స్టన్నింగ్ లుక్స్ తో కుర్రకారుకు కైపెక్కిస్తోంది మిల్కీ బ్యూటీ. సదరు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సో ప్రెట్టీ, సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా భాటియా అందాలకు కుర్రకారు చిత్తు కావాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. తమన్నా ఓ వైపు హీరోయిన్ గా కొనసాగు..తూనే మరో వైపున డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తోంది ఈ సుందరి. ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో ‘కొడితే’ అనే స్పెషల్ సాంగ్ లో కనిపించింది ఈ భామ. బాలీవుడ్ లో ‘బబ్లీ బౌన్సర్’ అనే ఫిల్మ్ ఇటీవల కంప్లీట్ చేసింది ఈ సుందరి.

https://www.instagram.com/p/CdVsBhvv_F7/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news