” ది కాశ్మీరీ ఫైల్స్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

-

“ది కాశ్మీరీ ఫైల్స్” చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కాశ్మీరీ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు.

థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిని షేక్ చేసేందుకు రెడీ అయింది. అయితే మే 13 నుండి ది కాశ్మీరీ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందేే.పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కాశ్మీరి ఫైల్స్ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news