సినిమా చరిత్రలోనే అలాంటి క్రెడిట్ కలిగిన ఏకైక హీరో..?

-

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎటువంటి మేకప్ ఉపయోగించకుండా తన జుట్టును న్యాచురల్ గా చూపించిన ఏకైక హీరో కూడా ఈయనే కావడం గమనార్హం. అందరి హీరోల మాదిరి కాకుండా తన రూటే సపరేటు అనేలా వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి హీరోలు అన్న తర్వాత కేవలం సినిమాలలోనే కాదు ఇతర రంగాలలో కూడా ఎంతో ప్రతిభ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోయిన విషయం తెలిసిందే.

అయితే సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి క్రెడిట్ అజిత్ కి మాత్రమే ఉంది. ఈయనకు సినిమాలు కాకుండా బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం బైక్ పై దేశం మొత్తం చుట్టేస్తూ.. తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు.ఇలా బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఆ జుట్టు తనకు వచ్చినప్పుడు ఏకంగా ఫ్లైట్ రైడింగ్ కూడా చేయడానికి ఇష్టపడతాడు. నిజానికి ఫ్లైట్ నడపాలి అంటే లైసెన్స్ రావాలి.. అందరికీ ఫ్లైట్ నడిపే అవకాశం ఉండదు.. కానీ అజిత్ గొప్పతనం ఏమిటంటే సౌత్ ఇండస్ట్రీలో ఫ్లైట్ నడిపే లైసెన్స్ కేవలం ఈయన దగ్గరే ఉండడం గమనార్హం.

ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా ఫ్లైట్ నడిపే లైసెన్స్ లేదు. కానీ అజిత్ దగ్గర మాత్రం ఆ లైసెన్స్ ఉందని చెప్పవచ్చు. అందుకే ఫ్లైట్ లో గాల్లో కూడా విహరిస్తుంటాడు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అజిత్ నుంచి వస్తున్న సినిమా తునివు.. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 11వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news