ఆ విషయంలో సుధీర్ డిమాండ్ చూసి షాక్ అవుతున్న ప్రొడ్యూసర్స్.!!

-

రామోజీరావు ఫిలిం సిటీలో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ .. ఆ తర్వాత వేణు వండర్స్ టీం ద్వారా జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు..అక్కడ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన తర్వాత కమెడియన్గా జబర్దస్త్ లో అలరించాడు. వేణు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి వారితో సుమారుగా కొన్ని వందల స్కిట్ లను పూర్తి చేశారు. ముఖ్యంగా టీం లీడర్ గా మారిన సుధీర్ తన నటనతో కామెడీ టైం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. కేవలం కమెడియన్ గానే కాకుండా డాన్సర్ గా , యాంకర్ గా , హీరోగా కూడా తనను తాను మార్చుకుంటూ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి మల్లెమాల యూనిట్ కి గుడ్ బై చెప్పిన సుధీర్ మాటీవీలో ప్రసారమవుతున్న పలు సింగింగ్ కాంపిటీషన్స్ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సినిమాతో హీరోగా మారినా.. ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు గాలోడు , వాంటెడి వంటి సినిమాల ద్వారా మళ్ళీ హీరోగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ట్రైలర్ టీజర్స్ విడుదల చేయగా వాటిలో మాస్ యాక్షన్ తో ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక స్టంట్ మాస్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న సుదీర్ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం భారీ రేంజ్ లో పారితోషకం అడుగుతూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సుధీర్ ఎంత పారితోషకం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

ఇకపోతే సుధీర్ తాజాగా దర్శక ధీరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వాంటెడ్ పండుగాడు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 10 కోట్ల రూపాయలు ఉంటుందని.. ఇక ఈ సినిమా కోసం ఆయన రూ.80 లక్షల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news