శ్రీలిలకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించగా.. హీరోయిన్గా శ్రీలీల నటించింది. ఈ చిత్రం గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. హీరోయిన్గా శ్రీ లీల మంచి పాపులారిటీ సంపాదించింది. యంగ్ హీరోల సరసన నటించేందుకు ఈమెకు పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ అందంతోపాటు, నటన, డ్యాన్స్ తో కూడా అదరగొట్టడంతే రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రంలో కూడా ఆఫర్ రావడంతో ఓకే చెప్పింది.

ఎంతోమంది యంగ్ హీరోలు సైతం తమ సినిమాలలో హీరోయిన్గా శ్రీలీల నే ఉండాలని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీలీల గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చేతిలో ఇన్ని సినిమాలోతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఒక స్టార్ హీరో అవకాశం ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పోయిందట. గతంలో ఓకే చేసిన ఆ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ కి చెప్పగా.. శ్రీ లీల కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఆ చిత్రం నుంచి తప్పుకోబోతున్నట్లు తెలియజేసిందట. ఈ విషయాన్ని డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పడంతో.. హీరో డైరెక్టర్గా శ్రీ లీల కు ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే హీరోయిన్ గా కొనసాగించవచ్చు..లేకపోతే కొనసాగించడం కష్టమని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు.. మరి శ్రీలీలని బెదిరించిన ఆ స్టార్ హీరో ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. మరి ఈ విషయంపై శ్రీ లీల స్పందిస్తుందేమో చూడాలి.