సమంత, మలైక‌, సుష్మితలు గోల్డ్ డిగ్గర్స్..నెటిజన్ల తీవ్ర విమర్శలు..!

-

ప్రజెంట్ సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఏదేని విషయమై నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉండటం మనం చూడొచ్చు. సెలబ్రిటీల చర్యలను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, మలైకా అరోర, సుష్మితా సేన్ లపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ ‘గోల్డ్ డిగ్గర్స్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

సుష్మితా సేన్..లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నట్లు కన్ఫ్మర్మ్ చేసిన క్రమంలోనే నెటిజన్లు ..సుష్మితను టార్గెట్ చేశారు. బంగారం ఎక్కడుంటే అక్కడ తవ్వుకునే రకం ‘సుష్మిత’ అని అర్థం వచ్చేలా ‘గోల్డ్ డిగ్గర్’ అనే పదంతో ట్రోల్ చేస్తున్నారు. గతంలో తన కంటే 12 ఏళ్లు చిన్న వాడైన వ్యక్తిని డేట్ చేసిన సుష్మిత..ఇప్పుడు లలిత్ మోడీతో రొమాన్స్ చేస్తుందని విమర్శలు చేస్తున్నారు.

సమంత..యంగ్ హీరో నాగచైతన్యలు డైవోర్స్ తీసుకున్న క్రమంలోనూ నెటిజన్లు సమంతను..తీవ్రంగా ట్రోల్ చేశారు. నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న సమంత..సెకండ్ హ్యాండ్ ఐటం అని, నాగచైతన్య నుంచి రూ.50 కోట్ల డబ్బు తీసుకుందని ఆరోపించగా, సమంత..ఆ కామెంట్ చేసిన నెటిజన్ కు ‘గాడ్ బ్లెస్ యువర్ సౌల్’ అని రిప్లయి ఇచ్చింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనీని హీరోయిన్ రియా చక్రవర్తి కాజేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఆమెనూ ‘గోల్డ్ డిగ్గర్’ అని నెటిజన్లు విమర్శించారు.

ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన బ్యూటిఫుల్ మలైకా అరోర విషయానికొస్తే..అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయిన క్రమంలో ఈమెను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు. భర్త నుంచి తీసుకొచ్చుకున్న డబ్బులతోనే మలైక బతుకుతున్నదని, తనకంటూ ఏ పని లేదని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. కాగా, ఈ కామెంట్స్ పైన తాను స్పందించబోనని, తన పని తాను చేసుకుంటానని మలైక స్పష్టం చేసింది. మలైక్ తనకంటే చిన్న వాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news