ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!

-

థియేటర్ మరియు ఓటీటీ లలో గత వారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాగా ఇప్పుడు తక్కువ బడ్జెట్ చిత్రాలే ఈవారం విడుదల కాబోతున్నాయి. అలాగే ఓటీటీ లో కూడా సస్పెన్షన్ తో పాటు కామెడీ సీరీస్ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి జూన్ రెండవ వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టక్కర్: హీరో సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం టక్కర్. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 9వ తేదీన తెలుగుతో పాటు తమిళ్ భాషలో కూడా ఒకేసారి విడుదల కానుంది.

విమానం: అనసూయ ,సముద్రఖని , మీరాజాస్మిన్, మాస్టర్ దృవన్ కీలక పాత్రలు పోషిస్తూ.. నటిస్తున్న చిత్రం విమానం.. డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జి స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్ స్టాపబుల్:
బిగ్బాస్ ఫేమ్ వి. జే. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్ స్టాపబుల్. ఈ సినిమా జూన్ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

పోయే ఏనుగు పోయే:
మాస్టర్ శశాంత్ హీరోగా డైరెక్టర్ కె ఎస్ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం పోయే ఏనుగు పోయే. ఇక ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈవారం ఓటీటీలోకి రాబోయే వెబ్ సిరీస్ లు ,చిత్రాల విషయానికి వస్తే..

అమెజాన్ ప్రైమ్ : హాలీవుడ్ మూవీ మై ఫాల్ట్ జూన్ 8
నెట్ ఫ్లిక్స్: ఆర్నాల్డ్ జూన్ 7, నెవర్ హావ్ ఐ ఎవర్ జూన్ 8, టూర్ డి ఫ్రాన్స్ జూన్ 8.

డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ :
అవతార్ ది వే ఆఫ్ వాటర్ జూన్ 7

సోనీ లివ్: 2018 జూన్ 7

Read more RELATED
Recommended to you

Latest news