ప్రశాంత్​ నీల్​కు తారక్ బర్త్ డే గిఫ్ట్.. నాటుకోడి పులుసుతో టేస్టీ ట్రీట్

-

‘కేజీఎఫ్’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గత ఆదివారం రోజున ప్రశాంత్ నీల్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ప్రశాంత్​కు బర్త్ డే విషెస్​ వెల్లువెత్తాయి. ఇక సలార్​ సెట్​లో ప్రభాస్​ తన డైరెక్టర్​కు బెస్ట్ బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే ప్రశాంత్ నీల్ బర్త్ డేేకు తారక్ కూడా స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖితా రెడ్డి తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రశాంత్ బర్త్ డే స్పెషల్ ట్రీట్​గా ఎన్టీఆర్ తాను స్వయంగా చేసిన నాటు కోడి పులుసు పంపించాడు. నాటుకోడి పులుసు అదిరిందంటూ లిఖితా రెడ్డి.. థాంక్యూ అన్నయ్యా అని తారక్​కు కృతజ్ఞతలు చెబుతూ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news