ప్రస్తుతం ఇండియా మొత్తం డైరెక్టర్ ఎవరు అంటే వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి. తన సినిమాలతో టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ గానే నిలిచిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన అర్ అర్ ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా గోల్డెన్ లో అవార్డున సైతం దక్కించుకుంది ఈ అవార్డ్ అందుకొని భారత్ మొత్తం ఎంతగా మురిసిపోయిందో. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను తెరకేకెక్కించిన రాజమౌళి ఫేవరెట్ సినిమాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..
రాజమౌళికి నచ్చిన కొన్ని సినిమాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో ముందుగా 1980లో కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా. ఈ సినిమా అప్పట్లో ఎంత గొప్ప సినిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించగా… కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా హిట్ అయిందని చెప్పాలి ఈ సినిమా అంటే రాజమౌళికి ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పకు వచ్చారు అలాగే మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినీమా అంటే కూడా రాజమౌళికి ఎంతో ఇష్టమంట.. వీటితో పాటుగా బండిట్ క్వీన్, బ్లాక్ ఫ్రైడే సినిమాలు కూడా తనకి ఎంతో ఇష్టమని చెప్పారు. 1993 తర్వాత ఇండియాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో వచ్చిన బ్లాక్ ఫ్రైడే సినిమా అప్పట్లో మంచి హిట్గా నిలిచింది అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించింది.. కాగా ఇటీవల కాలంలోని తమిళంలో వచ్చిన అడుకలం అనే సినిమాను కూడా చూడమని జక్కన్న చెప్పుకొస్తున్నారు..