క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన కథానాయికలు..

-

జీవితంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలు ఎదురయితే చాలు..పారిపోతుంటారు. ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలనుకునే వాళ్లు కొంత మందే ఉంటారు. ధైర్యంగా ఎదుర్కొని ఇతరులకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలని అనుకునేవారు అతి కొద్ది మంది మాత్రమే. అందులో ఈ కథానాయికలు కూడా ఉన్నారు.

భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచారు వీళ్లు. ఆత్మస్థైర్యంతో క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డారు. ఆ హీరోయిన్స్ ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమతైన హీరోయిన్స్ సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, మనీషా కోయిరాల, సీనియర్ హీరోయిన్ గౌతమి. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ కూడా ఈ కోవలోకి వస్తుంది.

విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య, సీనియర్ హీరోయిన్ గౌతమి రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సార్లు రేడియో థెరపీ తీసుకుని క్యాన్సర్ బారిన పడితే భయపడాల్సిన అవసరం లేదని నిరూపించింది.

సోనాలి బింద్రే తెలుగు నాట నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ . ఈమె కూడా క్యాన్సర్ బారిన పడింది. హై గ్రేడ్ క్యాన్సర్ బారిన పడిన క్రమంలో ఈమె హెయిర్ లాస్ అయింది. దాంతో అభిమానులు ఆమెను అలా చూసి బాధపడ్డారు. కానీ, తాను మాత్రం ధైర్యంగా విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకుంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చింది. మనో ధైర్యంతోనే తాను క్యాన్సర్ ను జయించానని స్పష్టం చేసింది.

సింగర్ గా గానే కాక హీరోయిన్ గానూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మమతా మోహన్ దాస్ కూడా..అతి చిన్న వయసులో అనగా పాతికేళ్ల టైంలోనే బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. అయితే, ఆమె క్యాన్సర్ కు భయపడకుండా..ట్రీట్ మెంట్ తీసుకుంది. క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం హ్యాపీగా ఉంది. మాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

మనీషా కోయిరాల..నటించిన చిత్రాలు తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన ఈ నటి..ఎంతో ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ప్రజెంట్ బాలీవుడ్ లో ఈమె సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ వైఫ్ తహీరా కశ్యప్ క్యాన్సర్ బారిన పడి..హెయిర్ లాస్ అయింది. ఈమె రెండు సార్లు క్యాన్సర్ ను జయించింది.

Read more RELATED
Recommended to you

Latest news