తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో చలామణి అవుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వరుస చిత్రాలు ప్రకటించి మరింత దగ్గరయింది. ఒకవైపు టీవీ షోస్ అలాగే పలు యాడ్స్ కూడా చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా తాజాగా తాను మయో సిటీస్ వ్యాధిబారిన పడ్డాను అని శనివారం రోజు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది..ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు , నెటిజనులు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే సమంతకు ఈ మయో సిటీస్ రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. మయో సిటీస్ అనేది అంటువ్యాధుల నుంచి కూడా వచ్చే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అని చెప్పవచ్చు. దీని ఫలితంగా నేరుగా కండరాలు దెబ్బతింటాయి. తద్వారా నడవలేని పరిస్థితికి చేరుకుంటారు. పైగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి త్వరగా కోలుకోవడం కూడా అసాధ్యమనే చెప్పాలి. అలాగే తీవ్రమైన వ్యాయామాలు చేసే సమయంలో కూడా కండరాలకు అసౌకర్యం కలిగి బలహీనంగా మారుతాయి. ఇలా ఏర్పడిన కొన్ని సందర్భాలలో మయోసిటీస్ కి దారి తీయవచ్చు అని వైద్యులు సైతం చెబుతున్నారు.
మరి మయోసిటీస్ వచ్చినప్పుడు ప్రధాన లక్షణం.. కండరాల బలహీనంగా మారడం, అలసటగా అనిపించడం, చర్మంపై దద్దుర్లు రావడం, శరీరం సమతుల్యత కోల్పోవడం, చేతులపై చర్మం గట్టిపడడం, కండరాల నొప్పి, బరువు తగ్గడం, కండరాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరి ఈ సమస్యకు చికిత్స లేదా అంటే స్పష్టమైన చికిత్స ఏమీ లేదనే చెప్పాలి ఉపశమనం పొందాలి అంటే ఫిజియోథెరపీతో పాటు వ్యాయామాలు చేయడం అలాగే ఆంటీ రుమాటిక్ మందులు వాడడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.