సినీ ఇండస్ట్రీలోకి కొంతమంది డబ్బు కోసం అడుగుపెడితే.. మరికొంతమంది గుర్తింపు కోసం అడుగుపెడుతూ ఉంటారు. కానీ మరి కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి నటన మీద ఆసక్తితో అడుగుపెడుతూ ఉంటారు. అలా నటన మీద ఆసక్తి ఉన్నవాళ్లు తమ చివరి శ్వాస విడిచే వరకు కొనసాగుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వయస్సు మీద పడుతున్నా.. ఇంకా సినిమాలపై మక్కువ తో ఇంకా నటిస్తూనే ఉన్న స్టార్ సెలబ్రెటీల గురించి మనం ఇప్పుడు ఒక్కసారి చదివి తెలుసుకుందాం.
చంద్రమోహన్:
హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన చంద్రమోహన్ ఎంతోమంది హీరోలను స్టార్ హీరోయిన్లుగా మార్చాడు. ఇక 1966లో రంగులరాట్నం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కూడా నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 60 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్న ప్రముఖులలో చంద్రమోహన్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది.
రాజేంద్రప్రసాద్:
నట కిరీట రాజేంద్రప్రసాద్ 1977లో స్నేహం అనే సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ స్టార్ గా తన వంతు ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. 20 ఏళ్లకు పైగా హీరోగా నటించిన తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్లో బిజీ అయ్యాడు. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం 44 సంవత్సరాలగా తండ్రి పాత్రలు పోషిస్తూ అద్భుతంగా సినిమాలలో రాణిస్తున్నారు.
బ్రహ్మాజీ:
1986లో మన్నెంలో మొనగాడు అనే సినిమా ద్వారా సపోర్టింగ్ పాత్రలో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి, ఆ తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సింధూరం వంటి సినిమాలలో హీరోయిజం చూపించిన ఈయన సుమారుగా 20 సినిమాల వరకు హీరోగా నటించి.. ఈయన ప్రస్తుతం కమెడియన్ గా నటిస్తూనే మరొకపక్క సహాయక పాత్రల్లో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నారు.