ఐశ్వర్యరాయ్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

-

తెలుగు ప్రేక్షకులకు, బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అంటే సుపరిచితమే. ముఖ్యంగా ఈమె అందానికి ఆకర్షితులు అవ్వనివారంటూ ఎవరు ఉండరు. 1973 నవంబర్ 1న మంగళూరులో జన్మించింది. మొదటిసారి మిస్ ఇండియా టైటిల్ పోటీలో రన్నర్ గా నిలిచింది. అయినా సరే తన అందంపై నమ్మకంతో మళ్ళీ ప్రయత్నించగా..1994లో మిస్ వరల్డ్ గా ఐశ్వర్య నిలిచింది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి ఐశ్వర్యారాయ్ కి. అలా సరైన చిత్రంతో తన కెరియర్ సాగించాలని ఐశ్వర్య రాయ్ ఆచితూచి అడుగులు వేసింది. అలా మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్ అనే సినిమాలో నటించింది. అలా మొదటి చిత్రంలోని రెండు విభిన్నమైన పాత్రలను పోషించిన ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కానీ ఈ సినిమా పరాజయమైనట్లుగా తెలుస్తోంది. హిందీలో నటించిన తొలి చిత్రం ఔర్ ప్యార్ హోగయా కూడా ఐశ్వర్యరాయ్ అందం మెరుపులకు తగ్గ విజయాన్ని అందించలేకపోయింది. ఇక తర్వాత డైరెక్టర్ శంకర్ తనతో జీన్స్ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఐశ్వర్యరాయ్ డేట్ల కోసం డైరెక్టర్లు నిర్మాతలు సైతం క్యూ కట్టారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలతో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో నటించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ ధరించిన దుస్తులని ధరించడం కోసం అమ్మాయిలు అప్పట్లో ఎక్కువ మక్కువ చూపించే వారట.

ఇక తెలుగులో రావోయి చందమామ సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది. ఈ చిత్రంలో ఒక పాట కోసం అప్పట్లోనే ఐశ్వర్యారాయ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుందని సమాచారం. ఈ పాట షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు రోజులపాటు చిత్రీకరించారట. ఇక ఈమెను చూడడానికి అక్కడికి సినీ జనమే ఎక్కువగా వస్తూ ఉండేవారట . దీంతో తెలుగులో కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని అర్థం అయింది. ఇక ఐశ్వర్యరాయ్ కెరియర్ లో ఎన్నో చిత్రాలను తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఐశ్వర్యారాయ్ నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య ఒక బిడ్డకు తల్లి అయిన కూడా ps -1 లో యువ హీరోయిన్లకు పోటీగా నటించిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news