ఆయన పావలా పవన్ అయితే నీ రేటెంత..!

-

కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృధ్వి బ్రహ్మానందం కాస్త వెనుకపడ్డ తర్వాత బాగా ఫాంలోకి వచ్చాడు. వరుస అవకాశాలతో పృధ్వి లేని సినిమా లేదు అన్న విధంగా అందరిని అలరిస్తున్నాడు. ముఖ్యంగా తన స్టైల్ ఆఫ్ కామెడీతో అలరించే పృధ్వి సడెన్ గా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈమధ్యనే ఏపికి వెళ్లి వై.ఎస్ జగన్ ను కలిసి తనకు ఆయన మద్ధతు తెలిపిన పృధ్వి రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నాడు.

ఇక పవన్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశాడు పృధ్వి. ఏ వ్యక్తిని పర్సనల్ గా ఎటాక్ చేయకూడదని పవన్ కు ఓ రకంగా సపోర్ట్ గా మాట్లాడిన పృధ్వి పవన్ జగన్ ను ఎందుకు తిడుతున్నాడో అంటూ పవన్ మీద విమర్శలు చేశాడు. ఇక పవన్ మీద సాధిక యామిని చేసిన పావలా కామెంట్స్ పై విరుచుకు పడ్డాడు పృధ్వి. ఆయన పావలా అయితే నీరేటెంతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ ప్రోమోలో పృధ్వి ఈ కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఫుల్ ఇంటర్వ్యూలో ఇంకెన్ని విమర్శలు చేశాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news