ఈ సినిమా నిజంగా విజయ్ కి అగ్ని పరీక్షే….!!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ సరసన ఇజా బెల్లె, క్యాథరీన్ థెరిస్సా, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ఒక విభిన్న లవ్ స్టోరీ గా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నాడు. కె ఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మాతగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మితం అయిన ఈ సినిమా సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టాయి. అలానే కొద్దిరోజలు క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైర్ కూడా మంచి సక్సెస్ సాధించి సినిమాపై ప్రేక్షకుల్లో బాగా అంచనాలు పెంచడం జరిగింది.

ప్రేమికుల రోజు కానుకగా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రౌడీ హీరో కెరీర్ కి కొంత కీలకం కానుందని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ తరువాత విజయ్ నటించిన నోటా, ట్యాక్సీ వాలా, డియర్ కామ్రేడ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ యూత్ లో విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగిందని,

 

గత మూడు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా కెరీర్ పరంగా విజయ్ కు ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది. ఇక మొన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ, దర్శకుడు దగ్గరి నుండి ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతో గట్టిగా ప్రయత్నం చేసారని, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మరి ఈ సినిమా విజయ్ కు ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news