Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’లో కిల్లర్..భయాందోళనలో కంటెస్టెంట్స్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తొమ్మిదో వారంలోకి ఎంటర్ అయింది. కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పై ఫోకస్ చేస్తున్నారు. గత వారం హౌజ్ నుంచి అజయ్ బయటకు వెళ్లాడు. కాగా, ఈ వారంలో ఎవరు వెళ్తారో అనే భయం అయితే ఉంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా తమ గేమ్ ఆడుతున్నారు.

ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. కెప్టెన్సీ పోటీదారులకు ఈ వారం భయంకరమైన టాస్క్ ఇచ్చేశాడు ‘బిగ్ బాస్’. ‘కిల్లర్ ఉన్నాడు జాగ్రత్త’..అని హెచ్చరించాడు.

ఇక ‘కిల్లర్’ ఎవరో కనిపెట్టడం కోసం కంటెస్టెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే, బాబా భాస్కర్ మాస్టర్ తాను కిల్లర్ అంటే ఎవరు నమ్మబోరని కామెడీ చేశాడు. నటరాజ్ మాస్టర్ , బాబా మాస్టర్ మధ్య కూడా ఫన్ జనరేట్ అయింది. ఇంతలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కు పిలిచి పలు ప్రశ్నలు అడిగాడు.

ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఎంత? తెలుసా అని శివను అడగా, అతను తెలియదు బిగ్ బాస్ అన్నాడు. ఇక అషురెడ్డి, శివ, బాబా మస్టర్ తదితరులకు మీరే కిల్లర్ .. అని మీరు అనుకుంటున్నారా? అని అడుగుతూ ట్విస్ట్ ఇచ్చేశాడు. అంతలోనే ‘కాదు’ అని చెప్పేసి కూల్ చేశాడు.

ఈ క్రమంలోనే అనుకోని ఘటన ఇంటిలో జరిగింది.‘‘ఆ…….అని భయంకరంగా అరుపులు..’’ వినిపించాయి. వెళ్లి చూసే సరికి గోడ మీద ఉన్న అద్దంపై ‘‘నటరాజ్ డెడ్’’ అని రాసి ఉంది. దాంతో అది ఎవరో కనిపెట్టాలి అని అఖిల్ నటరాజ్ మాస్టర్ తో అంటాడు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? అనేది తెలియాలంటే మంగళవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news