రజిని మెచ్చిన ముగ్గురు దర్శకులు వీళ్లే

-

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా 2.ఓ. కొద్ది గంటల క్రితం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజినితో పాటుగా సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ కూడా అటెండ్ అయ్యారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారని.. లేట్ అయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.. అయితే కొన్నిసార్లు ఆలస్యం అమృతం కూడా అవుతుందని అన్నారు రజిని.

ఇక దర్శకుడు శంకర్ గురించి చెబుతూ ఈ సినిమాకు ఆయన బాగా కష్టపడ్డారని.. ఇండియా ప్రైడ్ దర్శకుడు శంకర్ అని అన్నారు. ఇక శంకర్ తో పాటుగా రాజమౌళి, రాజ్ కుమార్ హిరాణిల మీద ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్ రజిని. ఇండియన్ సినిమాకు ముగ్గురు జెమ్స్ వీళ్లని అన్నారు. రాజమౌళితో సినిమా చేసేందుకు తాను సిద్ధమే అని ప్రకటించారు. శంకర్ తో పాటుగా రాజమౌళి, హిరాణిలను ప్రస్థావించి రజిని 2.ఓ మీద తెలుగు, హింది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే ఈవెంట్ లో శంకర్ కు విష్ చేస్తూ రాజమౌళి వీడియో లైవ్ మెసేజ్ అలరించింది. శంకర్ కూడా తన అభిమాన దర్శకుడు రాజమౌళి అని చెప్పడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news