బస్సు డ్రైవర్, బస్సులోని ఓ ప్యాసెంజర్ మధ్య జరిగిన గొడవ బస్సులోని 13 మంది ప్రయాణికుల ప్రాణాలను తీసింది. చనిపోయిన 13 మందిలో గొడవ పడిన బస్సు డ్రైవర్, ప్యాసెంజర్ కూడా ఉండటం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం అక్టోబర్ 28 కి వెళ్లాల్సిందే.
అది చైనాలోని చోంగికింగ్ సిటీ. ఓ బస్సు బ్రిడ్జి నుంచి దూసుకుపోతున్నది. ఇంతలో బస్సులోని ఓ ప్రయాణికురాలు బస్సు ఆపాలని డ్రైవర్ వద్దకు వచ్చింది. కానీ.. డ్రైవర్ బస్సు ఆపలేదు. స్టాప్ లో దిగాలని చెప్పాడు. మధ్యలో బస్సు ఆపనన్నాడు. దీంతో ఆ ప్యాసెంజర్ కు చిర్రెత్తుకొచ్చింది. నేను ఆపమన్న చోట ఆపవా.. అంటూ డ్రైవర్ పై దాడి చేయడానికి ప్రయత్నించింది. తన దగ్గర ఉన్న పర్సుతో డ్రైవర్ ను కొట్టింది. దీంతో ఓ చేయితో ఆమెపై ఎదురుదాడి చేశాడు డ్రైవర్. ఈక్రమంలోనే బస్సు అదుపుతప్పింది. నేరుగా బ్రిడ్జి మీది నుంచి దూసుకెళ్లి.. రెయిలింగ్ ను ఢీకొంటూ నదిలో పడిపోయింది. అంతే.. బస్సులో మొత్తం 15 మంది ఉండగా.. 13 మంది నీళ్లలో మునిగి చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. వాళ్లిద్దరి గొడవ ఎంతమంది ప్రాణాలు తీసిందో చూశారా?
Footage has been released of the moment a bus veered off a bridge in China, killing at least 13 people.
A fight between the bus driver and a passenger is being blamed for the crash https://t.co/AS08k77xOL pic.twitter.com/u7g2MeYm7c
— ITV News (@itvnews) November 2, 2018