మార్కెట్ కోసం బాలివుడ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకునే ఆలోచనలో టాలీవుడ్ స్టార్ హీరో…?

నిక్ జోనాస్, ప్రియాంకా చోప్రా పెళ్లి ఎందుకు చేసుకున్నారు…? చాలా మంది ప్రేమ అంటారు. కాస్త విషయం ఉన్న వాళ్ళు మాత్రం మార్కెట్ అంటారు. మార్కెట్ అంటే వేరే విధంగా కాదండోయ్. గత నాలుగేళ్ళుగా ప్రియాంకా చోప్రాకు హాలివుడ్ లో డిమాండ్ అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అక్కడ వరుసగా వెబ్ సీరీస్ లతో పాటుగా కొన్ని సినిమాలకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలని చూసింది.

ఈ నేపధ్యంలోనే నిక్ జోనాస్ తో ఆమె ప్రేమలో పడింది. అతన్ని వివాహం చేసుకుంది. రెండు రకాలుగా ఆమెకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ విధంగానే టాలివుడ్ హీరో, బాలివుడ్ హీరోయిన్ ఉన్నారని సమాచారం. ఒక సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ఒక హీరో, బాలివుడ్ లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో మంచి వసూళ్లను కూడా అతను సాధించాడు. దీనితో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, బాలివుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ ని వివాహం చేసుకుంటే అక్కడ కలిసి వస్తుంది అని భావిస్తున్నాడట.

ఆమె కూడా తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుందని సమాచార౦. ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించాలని కూడా భావిస్తున్నారట. వచ్చే ఏడాది వీరి వివాహం ఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా మాట్లాడుకున్నాయని సమాచారం. ఇక సినిమా కూడా దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం.