ట్విట‌ర్ పోల్ : బాహుబ‌లి క‌న్నా ట్రిపుల్ ఆర్ గ్రేట్ ? !

ట్రిపుల్ ఆర్ విడుద‌ల నేప‌థ్యంలో చాలా థియేట‌ర్లు సంద‌డిగా ఉన్నాయి. తిరిగి తెరుచుకుని పండ‌గ వాతావర‌ణంలో బిజినెస్ చేస్తున్నాయి. చాలా థియేట‌ర్లు ఇంత కాలం మూత‌బ‌డి ఉన్నా కూడా ఏదో ఒక విధంగా వీటిని తెరిపించాలి అని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లీకృతం కాలేదు. చాలా అంటే చాలా నిరాశ‌లో థియేట‌ర్ నిర్వాహ‌కులు ఉండిపోయారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఉన్న థియేట‌ర్లు కూడా క‌రోనా కార‌ణంగా తీవ్ర న‌ష్టాలే చ‌వి చూశాయి. సిబ్బందికి స‌గం జీతం చెల్లించి కాలం వెళ్ల‌దీశాయి కూడా !

ఇంత‌టి అన‌నుకూల వాతావ‌ర‌ణంలో బాహుబ‌లి క‌న్నా మించిన అంచనాల‌తో ట్రిపుల్ ఆర్ విడుదల‌యింది. వాస్త‌వానికి ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చినా కూడా రాజ‌మౌళి అనే ద‌ర్శ‌కుడిపై ఉన్న గౌర‌వం కార‌ణంగా, ఆయ‌న తీసే సినిమాల‌పై ఉన్న ప్రేమ కార‌ణంగా ఎవ్వ‌రూ నిరాశ‌కు లోన‌వ్వ‌లేదు. ఎవ్వ‌రూ అంతగా ఆందోళ‌న చెంద‌లేదు. సినిమా ఎప్పుడు విడుద‌ల అయినా విజ‌య‌వంతం అవుతుంద‌ని రాజ‌మౌళి చెబుతూనే వ‌స్తున్నారు.ఇదే స‌మ‌యంలో అప్పులు తెచ్చి వ‌డ్డీలు కట్టి సినీ నిర్మాణం చేపట్టిన డీవీవీ దాన‌య్య‌కు కూడా ఇదే త‌ర‌హాలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఏద‌యితేనేం సినిమా విడుద‌ల‌యింది. ఇప్పుడు అసలు సిస‌లు చ‌ర్చ మొద‌లైంది.

బాహుబ‌లి క‌న్నా ట్రిపుల్ ఆర్ గ్రేట్ అని చాలా మంది వాద‌న వినిపిస్తున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోలు (తార‌క్ మ‌రియు చ‌ర‌ణ్‌) ను బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని చెబుతూ, రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కులు ఇలాంటి ఫీట్ ను సునాయాసంగా దాటేశార‌ని పొగ‌డ్త‌ల వాన కురిపిస్తున్నారు. బాహుబ‌లి క‌న్నా ఈ సినిమా లో చాలా ఉద్వేగాలు బాగా పండాయి అని కితాబిస్తున్నారు. ఎన్టీఆర్ చాలా స‌న్నివేశాల్లో జీవించాడ‌ని, చ‌రణ్ కూడా ఎక్క‌డ ఏమీ త‌గ్గ‌కుండా డైరెక్ట‌ర్ చెప్పిన విష‌యాల‌ను అర్థం చేసుకుని భావోద్వేగాలు
ప‌లికించాడ‌ని చాలా మంది కితాబులు ఇస్తున్నారు.

ఓ విధంగా బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ క‌న్నా దాన‌య్య అంత గుండె ధైర్యం ఉన్న వ్య‌క్తి కాద‌ని, సౌమ్యుడ‌ని అంటాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. అదేవిధంగా భారీ బ‌డ్జెట్ అంటే సాహ‌సం అలాంటిది క‌రోనా సమ‌యంలో కూడా ఆయ‌న ఎక్క‌డా బాధ‌ప‌డిన దాఖ‌లాలు లేవు. సినిమాను సేఫెస్ట్ జోన్ లో అమ్మి కాస్తో కూస్తో క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కాల‌న్న‌ది ఆయ‌న వ్యూహం. ఇందుకు అనుగుణంగానే బాహుబ‌లి కన్నాఎక్కువ డబ్బు ఖ‌ర్చుపెట్టి సాహ‌సోపేత‌మ‌యిన నిర్ణ‌యాలు వెలువ‌రించి., 3 డీ ఫార్మెట్ లో కూడా సినిమాను సిద్ధం చేయించి ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ డ‌బ్బును వెనుకంజ వేయ‌కుండా ఖ‌ర్చు పెట్టారు దాన‌య్య. ఆ విధంగా బాహుబ‌లి నిర్మాత‌ల క‌న్నా ట్రిపుల్ ఆర్ నిర్మాతే గ్రేట్ .

– ట్విట‌ర్ పోల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం