ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయిల్డ్ రైస్ ఎవరు ఉపయోగించరని.. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదని పేర్కొన్నారు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయని.. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసిందని ఆయన వివరించారు. 26600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టామని.. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయని చురకలు అంటించారు.
రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదన్నారు. బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదని.. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశమని టిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. నా ప్రకటన వల్ల, మా రాష్ట్ర అధ్యక్షుడి స్టేట్మేట్ వల్ల ధాన్యం ఉత్పత్తి పెరగదని.. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం చివరి గింజ కొంటామని వెల్లడించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొదుపు సంఘాలు కూడా ధాన్యం కొనుగోలు చేశాయన్నారు. గోనె సంచి సుతులి డబ్బులు కూడా కేంద్రం ఇస్తుందని.. కేంద్రం ఇచ్చిన డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ మిగులుతుందని వెల్లడించారు. కేంద్రానికి పూర్తి స్థాయి మిషనరీ లేదని చెప్పారు.