Unstoppable season 4: ఆన్ స్టాపబుల్ సీజన్ – 4 ప్రోమో రిలీజ్

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. తెలుగు ఓటిటి ఆహా లో బాలకృష్ణ చేసిన ఈ అన్ స్టాపబుల్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సీజన్ 1, 2, 3 మూడు మంచి సక్సెస్ అయ్యాయి. మొదటి మూడు సీజన్లలో సినీ, రాజకీయ ప్రముఖులను షో కి పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అయ్యింది.

ఈ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇంత సూపర్ హిట్ అయిన ఈ షో ని మళ్లీ మొదలు పెట్టబోతున్నారు. తాజాగా నాలుగో సీజన్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోనీ తాజాగా ఆహా విడుదల చేసింది. ట్రైలర్ లో సూపర్ హీరో అవతార్ లో నందమూరి బాలకృష్ణని ట్రైలర్ లో చూపించింది ఆహా.

ఈ ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. అసలు పండుగ లేని ప్రాంతానికి బాలయ్య పండుగను తీసుకువెళ్లినట్టు చూపించి ఆసక్తి పెంచేశారు. బాలకృష్ణ 50 ఇయర్స్ ను ఈ షో ద్వారా సెలబ్రేట్ చేసేందుకు ఆహా టీం సిద్ధమైంది. కంటెంట్ పరంగా చూస్తే నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో బాగుంది. అక్టోబర్ 24 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version