ఆ వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశీ రౌతేలా

-

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో (బాత్రూమ్ వైరల్ వీడియో) నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ అది మూవీ షూటింగ్‌లో క్లిప్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

‘‘నేను నటిస్తోన్న కొత్త చిత్రం ‘గుస్పేటియా’. ఆ సినిమాలో నాపై చిత్రీకరించిన ఓ సీన్‌ ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. అది నన్నెంతో బాధించింది. సినిమా విడుదలకు ముందే వీడియోస్‌, ఫొటోలు లీక్‌ కావడం నిరాశకు గురిచేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదని కోరకుంటా’’ అని ఊర్వశి ఆ పోస్టులో చెప్పుకొచ్చింది.

 

బాలకృష్ణ నటిస్తున్న 109 చిత్రంలో ఊర్వశీ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా సెట్‌లో తనకు స్వల్ప గాయాలయ్యాయని ఇటీవల ఆమె పోస్ట్‌ పెట్టింది. మరోవైపు ‘గుస్పేటియా’ చిత్రానికి సూషి గణేషన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 9న ఇది విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version