UrvashiRautela: ‘కాంతారా-2’ లో ఈ బాలీవుడ్ భామ

-

డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగు సినిమాలు అన్నీ కాంతారా చేతిలో ఓడిపోయా యి ఇప్పటికే పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా డబ్బులు రాబట్టింది.

ప్రస్తుతం ‘కాంతారా 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ చేసిన పోస్ట్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టా స్టోరీలో చేసిన పోస్ట్ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అది ఏంటంటే కాంతారా 2 లో ఊర్వశీ రౌతేలా హీరోయిన్ గా నటించనుంది. రిషబ్ శెట్టితో ఉన్న ఫోటోతో పాటు ‘కాంతార 2’ లోడింగ్ అనే మెసేజ్ కూడా పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news