రిలీజ్ కు ఒకరోజు ముందు వకీల్ సాబ్ నుండి అదిరిపోయే న్యూస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీ రాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కథను డైరక్టర్ వేణు శ్రీరాం తెలుగు నేటివిటీకి దగ్గరగా పవర్ స్టార్ ఇమేజ్ కోసం మార్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో విప్లవ నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది.

Vakeel Saab Secret Revealed befor Release Oneday

అదేంటి సినిమాలో పవన్ కళ్యాణ్ వకీలుగా కనిపిస్తున్నాడు కదా అనుకోవచ్చు. కేవలం పవర్ స్టార్ క్యారక్టర్ వెయిట్ పెంచడం కోసం ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పెట్టారట. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తప్పకుండా ఈ ఎపిసోడ్స్ సూపర్ ట్రీట్ ఇస్తాయని తెలుస్తుంది. రిలీజ్ కు ఒకరోజు ముందు ఈ న్యూస్ వైరల్ కావడంతో వకీల్ సాబ్ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓ రేంజ్ లో ఉండగా పవర్ స్టార్ వకీల్ సాబ్ మొదటిరోజే రికార్డులు తిరగరాస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.