కొరటాల శివ స్టోరితో బ్లాక్ బాస్టర్ అందుకున్న తారక్, వంశీ పైడిపల్లి..

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో తొలిసారి ఫ్లాప్ వచ్చింది. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆ సినిమా ముందు వరకు ఉన్నాడు దర్శకుడు కొరటాల. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ పిక్చర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, ప్రస్తుతం ఆయన తారక్ తో NTR30 ఫిల్మ్ చేస్తున్నాడు.

పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్న ఈ పిక్చర్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపైన అంచనాలను పెంచేసింది. కాగా, గతంలో తారక్ తో కొరటాల శివ రెండు సినిమాలు చేశాడు. ఒకటి దర్శకుడిగా కాగా, మరొకటి రచయితగా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ చిత్రానికి స్టోరి అందించారు కొరటాల శివ.

ఈ సినిమాతో తారక్, వంశీ పైడిపల్లికి మంచి పేరు వచ్చింది. అప్పటికే సక్సెస్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఇమేజ్ ను ఇంకా పెంచేసింది ఈ ఫిల్మ్. కొరటాల శివ స్టోరి రైటర్ గా పలు సినిమాలకు పని చేశాడు. అలా పని చేసిన తర్వాత ఆయనకు ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా అవకాశం లభించింది.

NTR 30 డెఫినెట్ గా అంచనాలకు మించి ఉంటుందని, ఇది ఫుల్ కమర్షియల్ మూవీ అని ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ-తారక్ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని సినీ ప్రియులు అంటున్నారు. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news