Varalaxmi Sarathkumar Wedding: ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలై సచ్ దేవ్ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. జులై 2న థాయిలాండ్ లో వివాహం జరగనుంది. శరత్ కుమార్-రాధిక దంపతులు ఇప్పటికే వివాహ పనులు మొదలుపెట్టారట. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రలలోనే నటిస్తోంది. ముఖ్యంగా తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.