ఈ కాంబినేషన్ కలిస్తే..!

-

త్రివిక్రం డైరక్షన్ లో ఏ హీరో సినిమా అయినా సరే కంపల్సరీ హిట్ అన్నట్టే. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న త్రివిక్రం తను రైటర్ గా ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమాలకు వర్క్ చేశాడు. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి లాంటి సినిమాలు త్రివిక్రం రైటింగ్ లో వెంకటేష్ హిట్ అందుకున్నవే. అయితే దర్శకుడిగా మారాక వెంకటేష్, త్రివిక్రం కలిసి సినిమా చేయలేదు.

ఏదో అజ్ఞాతవాసిలో అలా గెస్ట్ రోల్ చేశాడే తప్ప ఫుల్ మూవీ చేయలేదు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ చేయాలని చూస్తున్నారట. త్రివిక్రం అరవింద సమేత పూర్తి కాగానే వెంకటేష్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. వెంకటేష్ కూడా వరుణ్ తేజ్ తో ఎఫ్-2, నాగ చైతన్యతో వెంకీ మామ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసుకుని త్రివిక్రం కు లైన్ క్లియర్ చేస్తాడట.

ఈ కాంబినేషన్ కలిస్తే సిని ప్రియులకు పండ అన్నట్టే. తన మాటల తూటాలతో మనసులను కదిలించే త్రివిక్రం పెన్ పవర్ కు వెంకీ లాంటి సహజ నటుడు తోడైనా ఇక ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యి ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news