వెంకటేష్ అన్న సురేష్ బాబు నటించిన ఏకైక చిత్రం అదే..!!

-

సినీ ఇండస్ట్రీలో రామానాయుడు కొడుకులు గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు నిర్మాత సురేష్ బాబు.. తన సోదరుడు వెంకటేష్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. రామానాయుడు కూడా గతంలో ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం రామానాయుడు కొడుకులు గా వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరూ కూడా సినీ రంగాలలో బాగానే రాణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ సురేష్ బాబు గురించి తెలియని ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

సురేష్ బాబు 1990లో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో నిర్మాతగా మారారు. అలా వెంకటేష్ తో దాదాపుగా ఏడు ఎనిమిది సినిమాలు సురేష్ బాబు తెరకెక్కించడం జరిగింది.అప్పట్లో ఉదయ్ కిరణ్ తో నీకు నేను నాకు నువ్వు చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత వెంకటేష్ తోనే తులసి, మల్లేశ్వరి, మసాలా, దృశ్యం, దృశ్యం-2, నారప్ప గోపాల గోపాల వెంకీ మామ తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇతర హీరోలతో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తన ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఎన్నో సినిమాలను ప్రజెంట్ చేయడం జరిగింది.

నిజానికి మొదట 1982లో వచ్చిన దేవత సినిమాతోనే నిర్మాతగా మారారట సురేష్ బాబు. కానీ కేవలం బొబ్బిలి రాజా సినిమాతోనే తన పేరును నిర్మాతగా వేయించుకోవడం మొదలుపెట్టారట. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే సురేష్ బాబు నిర్మాతగానే కాకుండా నటుడుగా ఒక బాలీవుడ్ సినిమాలో నటించినట్లుగా సమాచారం. 2016 లో వచ్చిన బాలీవుడ్ సినిమా అజర్ లో నటించారట ఇందులో హీరోగా ఇమ్రాన్ హస్మి నటించారు. ఆ తర్వాత మరే సినిమాలలో కూడా కనిపించలేదు సురేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news