సర్ప్రైజ్ ఇచ్చిన వెంకీ మామ.. ఓరి దేవుడా సినిమా నుంచి అప్డేట్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన తెలుగు ప్రేక్షకులకు మరింత ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ కి మించిన పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తాజా గా విడుదల చేసిన వీడియోలో తెలియజేయడం జరిగింది చిత్ర బృందం. వెంకటేష్ విశ్వక్ సేన్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.. తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక దీపావళికి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కన్ఫామ్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ లుక్ చాలా విభిన్నంగా ఉండడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. మొత్తానికి ఈ సినిమా కమర్షియల్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా దీపావళికి వినోదాన్ని అందిస్తుందని సినీ ప్రేక్షకులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఓరి దేవుడా సినిమా నుంచి విడుదలైన ఈ గ్లింప్స్ వైరల్ గా మారుతున్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news